Wanted Reporters

Wanted Reporters

పెళ్లికి పుస్తే మెట్టెలు బహూకరణ సేవా భావం చాటిన జర్నలిస్ట్ బుక్క శ్రీనివాస్

 *-పెళ్లికి పుస్తే మెట్టెలు బహూకరణ*

*- సేవా భావం చాటిన జర్నలిస్ట్ బుక్క శ్రీనివాస్*


జిన్నారం తెలంగాణ సాక్షి:-

 తాను నమ్మిన సిద్ధాంతంతో పది మందికి తోడ్పాటు అందించాలని మంచి ఉద్దేశంతో జిన్నారం మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ బుక్క శ్రీనివాస్ తన విశాల హృదయాన్ని మరోసారి చాటారు. జిన్నారం గ్రామానికి చెందిన మంగలి విజయలక్ష్మి రవీందర్ దంపతుల కూతురు నిహారిక వివాహానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చి పుస్తే మట్టెలు బహుకరించారు. జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ బుక్క శ్రీనివాస్ గతంలో పలుమార్లు సేవాభావం తో ముందుకు వచ్చి పల్లె పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం అందించాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు బుక్క శ్రీనివాస్ తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరికీ సహాయ పడాలనే ఆలోచనతో బుక్క శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Ad Code