Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల మండల కేంద్రంలో విజయ పాల డైరీ కేంద్రాని ప్రారంభించిన ఎమ్మేల్యే జి.ఎమ్.ఆర్

 విజయ పాల డైరీ కేంద్రం ప్రారంభం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-


సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నంద్యాల విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ పాల డైరీ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా గుమ్మడిదల మండల కేంద్రంలో  వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ పాల డైరీ కేంద్రాన్ని మండల రైతులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి, స్వీట్లు తదితర సామాగ్రి  విక్రయాలు కూడా నిర్వహిస్తున్నట్లు సూచించారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం  చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు కె ప్రభాకర్, జడ్పిటిసి కుమార్ గౌడ్, నల్లవల్లి ఎంపిటిసి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, డి సి ఓ తుమ్మా ప్రసాద్, డిడి మురళీమోహన్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ, డి పి టి డైరెక్టర్ మోహన్ మురళి, విజయ డైరీ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఎంపీడీవో చంద్రశేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, డైరెక్టర్ జయశంకర్ గౌడ్, దేశబోయిన శ్రీనివాస్, మద్దుల బాల్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, విజయ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎం నరేందర్ రెడ్డి పటాన్చెరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌరీ శంకర్ గౌడ్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నక్క వెంకటేష్ గౌడ్,చిమ్మల దేవేందర్ రెడ్డి, పొన్నబోయిన వేణు, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగులయ్య, కుమ్మరి వెంకటేష్, ఎం.డి హుస్సేన్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code