మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీలో భాజపాలో చేరిక
తెలంగాణ సాక్షి న్యూస్:-
దిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డ కలిసి ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు. ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.




0 Comments