*పారిశ్రామికవాడలో కార్మిక దినోత్సవ వేడుకలు*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధి లో శనివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొంతపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి హాజరై కార్మికుల తరఫున యూనియన్ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మిక సంక్షేమం శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చక్రపాణి మల్లేష్ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments