*కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ ఆర్థిక సాయం అందజేత*
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామంలో నీ ఆర్చ్ ఫార్మా పరిశ్రమలో కార్మికులుగా పనిచేసే శ్రీనివాస్ కరోనా కు గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జిల్లా టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన పరిశ్రమ ప్రతినిధులు బాధిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయాన్ని టిఆర్ఎస్కెవి యూనియన్ నాయకుల సమక్షంలో అందజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కే వి నాయకులు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

0 Comments