*ఈదురుగాలులకు కులినా కోళ్ళ షెడ్డు భారీగా ఆస్తి నష్టం*
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
అకస్మాత్తుగా శనివారం సాయంత్రం వర్షంతో కూడిన ఈదురుగాలులకు ఓ సామాన్య రైతుకు తీవ్ర ఇబ్బందు లోకి నెట్టాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలకేంద్రానికి చెందిన గౌడెల్లి రాంరెడ్డి కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ రైతుకు కు సంబంధించిన ఐదు వేల సామర్థ్యం గల కోళ్ల షెడ్ శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులకు నేలమట్టమైంది. ఈ సంఘటనతో రైతు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని బోరున విలపించారు. సుమారు ఆరు లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని వివరించారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు కల్పించుకోని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు....


0 Comments