హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ బయలుదేరారు. ఇటీవల ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన ఆ పార్టీలో చేరతారని సమాచారం. ఈటల దిల్లీ ప్రయాణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల దాదాపు అన్ని పార్టీల నాయకులతో ఇటీవల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చివరకు భాజపాలో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి

0 Comments