Wanted Reporters

Wanted Reporters

పార్టీపై పెదవి విప్పిన ఈటల

కొత్త పార్టీపై పెదవి విప్పిన  ఈటల 


హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-


 హైదరాబాద్: కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు.  నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.


*అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా..!?*

పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటల పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. వేల కోట్లు సంపాధించానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. జమున హ్యాచరీస్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కాను. నయీం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా?’’ అని ఈటల ప్రశ్నించారు

Post a Comment

0 Comments

Ad Code