Wanted Reporters

Wanted Reporters

రిజిస్ట్రేష‌న్లకు ప్రభుత్వం అనుమతి

 


హైద‌రాబాద్‌ తెలంగాణ సాక్షి న్యూస్
: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సడ‌లింపు నిబంధ‌న‌లు పొడిగించిన నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల‌పై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. స‌డ‌లింపు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తివ్వాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలో మ‌రో ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్ర‌భుత్వం.. క‌ర్ఫ్యూ స‌డ‌లింపును ఉద‌యం 6 నుంచి ఒంటి గంట వ‌ర‌కు పెంచింది. ఇప్పటి వరకు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపు ఉండ‌టంతో రిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. తాజా నిర్ణ‌యంతో రేప‌టి నుంచి రిజిస్ట్రేష‌న్లు తిరిగి ప్రారంభం కానున్నాయి

1. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ లు ప్రారంభం.

2. రోజులు 24 slots మాత్రమే.

3. పార్టీ ల కు (అమ్మినవారికి & కొన్న వారికి) మరియు ఇద్దరు సాక్షులకు ఎంట్రీ పాస్ లు జారీ.

4. రెఐజిస్ట్రేషన్ పరిధి లో 2 ఆఫీసులు ఉన్నట్లయితే 48 slots.

5. ఆఫీస్ కార్యాలయం లోపలకు కేవలం (ఎక్కువలో ఎక్కువ) ఏడుగురు మాత్రమె అనుమతి.

6. తప్పని సరిగా స్లాట్ టైం కన్నా 5 నిమిషముల ముందు ఆఫీస్ లో హాజరు కావాలి.

7. పార్టీలకు తప్ప అన్యులకు కార్యాలయ ప్రవేశం నిషిద్ధం.

8. TIR తీసుకునే ముందు మరియు తీసుకున్న తరువాత sanitizer ఏర్పాటు.

Post a Comment

0 Comments

Ad Code