ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రపురం తెలంగాణ సాక్షి న్యూస్:-
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ - అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి కాలనీల మధ్య కోటి యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన బాక్స్ డ్రైనేజ్ కం కల్వర్టును ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ నుండి జాతీయ రహదారికి అనుసంధానం చేసే లింక్ బ్రిడ్జి లను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.


0 Comments