తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ
తెలంగాణ సాక్షి న్యూస్:-
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలోని తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక జెండాను స్థానిక ఎంపీపీ సద్ది ప్రవీణ భాస్కర్ రెడ్డి ఆవిష్కరించరు.
ఈ ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వెట్టి చాకిరి నుంచి కార్మికులు విముక్తులైన సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మిక చట్టాలను అమలుపరుస్తూ, అవగాహనతో పనిచేస్తేనే మరింత అభివృద్ధి చెందుతున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక అధ్యక్షులు వి ఎం ఎల్లయ్య, ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి . వార్డు సభ్యులు నాగేష్ గౌడ్, గటటి రమేష్, గ్యారళ మల్లేష్ టిఆర్ఎస్ నాయకులు. చక్రపాణి, శ్రీనివాస్, మహేష్ , టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముద్దంగుల గోపాల్ ,మరియు తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి.ప్రసాద్, సంయుక్త కార్యదర్శి. ఎన్. విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments