ముదిరాజ్ భవన్ మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చేరు తెలంగాణ సాక్షి న్యూస్:-
పటాన్ చేరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరు పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తో పాటు, అంబేద్కర్ భవన్, మున్నూరు కాపు కళ్యాణ మండపం, యాదవుల కల్యాణ మండపం, షాదీఖానాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోతామని అన్నారు.


0 Comments