*గుర్తు తెలియని అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన మైత్రీ ఫౌండేషన్*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ ప్రధాన రహదారి పక్కన ఈనెల 12న అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గుమ్మడిదల ఎస్ఐ విజయ కృష్ణ మైత్రి ఫౌండేషన్ అంబులెన్స్ లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఆ వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను సంబంధీకులు ఎవరైనా వస్తారని రెండు రోజులు చూసి గుమ్మడిదల ఎస్ఐ విజయకృష్ణ మైత్రి ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వగా దోమడుగు గ్రామ సర్పంచ్ అభి శెట్టి రాజశేఖర్ సహకారంతో గుమ్మడిదల పోలీసువారి ఆధ్వర్యంలో మైత్రి ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

0 Comments