సాకి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు తెలంగాణ సాక్షి న్యూస్:-
20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులను స్థానిక శాసనసభ్యులు గూడెంమహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీఏ నుండి 10 కోట్లు, జిహెచ్ఎంసి నుండి పది కోట్ల రూపాయలు చెరువు సుందరీకరణ పనులకు మంజూరయ్యాయని తెలిపారు. చెరువు కట్టపై 40 ఫీట్ల విస్తీర్ణంతో రోడ్డు, డివైడర్, హైమాస్ట్ లైట్లు, వాకింగ్ ట్రాక్, పార్కు, కూర్చునేందుకు బల్లలు, సెంట్రల్ లైటింగ్, గార్డెనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.


0 Comments