Wanted Reporters

Wanted Reporters

మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

 మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

తెలంగాణ సాక్షి న్యూస్:-


రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు తూర్పు, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల... ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(లోకల్ టైమ్స్ )
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక మీదగా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది

Post a Comment

0 Comments

Ad Code