ఓటు" వేసి అవినీతిని ప్రక్షాళన చేయండిప్జాస్వామ్యాన్ని పరిరక్షించండి ...ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం.
సిద్దిపేట తెలంగాణ సాక్షి న్యూస్:-
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు 29.4.2021 "ఓటు చైతన్యం" చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఓటు వేసే అవకాశం వచ్చిందని ఆచితూచి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. మనం వేసే ఓటు దీనులకు అండగా మానవత్వానికి ప్రతీకగా ఉండాలన్నారు, ఎన్నికలు ప్రజా సామ్యానికి జీవనాడి, దేశ సమగ్రతను కాపాడి, అభివృద్దిని ఐక్యతను శాంతిని నెలకొల్పే జననేతను ఎన్నుకొని, భారత సార్వభౌమాధికారాన్ని రక్షించి, మన సాధక బాధకాలల్లో అండగవుండి ప్రాంత వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే నాయకున్ని గెలిపించుకోవలన్నారు.
"ఎక్కడ ఓటు అధికంగా వినియోగిస్తారో, అక్కడ ప్రజాసామ్యం వర్ధిల్లుతుంది, ప్రజా ప్రభుత్వం గెలిచి నిలబడుతుంది" . ఓటు తప్పకుండా వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కరోనాను అధిగమించే పద్ధతులను పాటిస్తూ, డబ్బు, మద్యం, వస్తురూపేన ప్రలోభాలకు లొంగకుండా అందరూ ఓటుహక్కును సక్రమంగా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఈ కార్యక్రమములో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారులు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, ఉపాధ్యాయుడు రహీం,మైనారిటీ నేత ముస్తఫా తదితరులు పాల్గోన్నారు.

0 Comments