రైతన్నకు అండగా రైతు బీమా
రైతు బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న సమున్నత లక్ష్యం తో దేశంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం జంగం పేట గ్రామానికి చెందిన చెర్లపల్లి శ్రీ రాములు, పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే ఇద్దరు రైతులు ఇటీవల మృతి చెందారు. రైతు బీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బీమా రైతులకు కొండంత దీమా అందిస్తోందని అన్నారు. గుంట భూమి ఉన్న రైతు సైతం రైతు బీమా వర్తిస్తుందని తెలిపారు.

0 Comments