తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య
నల్గొండ తెలంగాణ సాక్షి న్యూస్:-
నల్లగొండ: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని, ఇక వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వరంగల్‌కు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

0 Comments