పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉంది
మనోహరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : రాష్ట్ర నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం మనోహరబాద్ మండలం కోనాయపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి , ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, సర్పంచ్ ప్రభావతి నర్సింలు, ఉప సర్పంచ్ మన్నే ధర్మేందర్ పాల్గొన్నారు , ఈ సందర్భంగా నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ కోనాయపల్లి , మనోహరాబాద్ మండల ప్రజలకు బతుకమ్మ, మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు, బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి, ప్రజల సంస్కృతిలో భాగంగా పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని తెలిపారు, తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని, పువ్వులను పూజించే గొప్పతనం తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతిలో ఒక భాగమని కొనియాడారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణంలో విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు, మొదట గణపతికి పూజలు నిర్వహించి బతుకమ్మ ఘాటు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ వారితో కాసేపు బతకమ్మ ఆడారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి నర్సింలు, ఉప సర్పంచ్ మన్నే ధర్మేందర్, పాలకవర్గం సభ్యులు, మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

0 Comments