ఘనపూర్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు : సర్పంచ్ పుష్ప నవీన్
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ ఎంతో పోరాటం చేశారని సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్ అన్నారు. తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో సర్పంచ్ పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతి పిత మహాత్మా గాంధీ 154వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పాలక వర్గం సభ్యులు, గ్రామ ప్రజలు యువకులు హాజరై మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి లు మాట్లాడుతూ.... దేశం కోసం తెల్ల దొరలను ఎదిరించిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ అని ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. గాంధీ చూపిన సత్యo, అహింస బాటలో ప్రతి ఒక్కరం ముందుకు వెళ్లాలని అప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు దేశానికి స్వేచ్ఛ కోసం కుల, మతాలను అతీతంగా అందరూ పోరాడాలని అన్నారు, అనంతరం నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి , పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు


0 Comments