*యువ నాయకులు గౌడిచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంద్రారెడ్డి జయంతి.. విగ్రహావిష్కరణ*
శంకర్పల్లి వాస్తవ తెలంగాణ న్యూస్;
ఇంద్రన్న అమర్ హై నినాదాలతో దద్దరిల్లిన జన్వాడ స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య గార్లతో కలిసి ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజలందరి నుండి దూరం అయి 23 ఏళ్ళు అవుతున్న పల్లెల్లో ఇంకా మార్మోగుతున్న ఇంద్రారెడ్డి పేరు
జయంతి సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గములో నీ శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహా ఆవిష్కరణ చేశారు. జన్వాడలో అంగరంగవైభవంగా ఇంద్రన్న జయంతి వేడుకలు...పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ లో రాజకీయ నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ ఇంద్రారెడ్డిది జన్వాడ గ్రామంలో యువ నాయకులు గౌడిచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంద్రన్న జయంతి నిర్వహించారు
*ఇంద్రన్న జయంతి సందర్భంగా యువ నాయకులు వెంకటేష్ జన్వాడ గ్రామంలో అడబిడ్డ పుట్టిన తల్లిదండ్రులకు 16 వేల నగదు కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.*
*ప్రముఖ తెలంగాణ గాయకులు ఏపూరి సోమన్న పాటలతో అలరించారు.*


0 Comments