తూప్రాన్ లో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరిoచిన: వంటేరు ప్రతాప్ రెడ్డి
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సాయుధ పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ కే ఆదర్శ మహిళ అని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రజకుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాదులో మూడు ఎకరాల స్థలంతో పాటు ఐదు కోట్ల రూపాయలు భవన నిర్మాణానికి కేటాయించారన్నారు. దోబీ ఘాట్ నిర్మాణానికి రెండు కోట్ల విలువైన స్థలం కేటాయించామని తెలిపారు. రజకుల అభివృద్ధికి రజక బంధు పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రజకులను పట్టించుకోలేదని కేసీఆర్ ప్రభుత్వం రజకుల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రం మనవడు సంపత్ తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, మామిడి వెంకటేష్, రవీందర్ రెడ్డి, నాయకులు కృష్ణ, రఘుపతి,జాతీయ రజక సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్, ఉప్పలయ్య, నర్సింలు, లావణ్య, పోతురాజు లింగం, పోతరాజు దన్ రాజ్,
కొట్టంల ఉపేందర్, బాయ్ కాడి నర్సింలు, సిద్ధ రాములు, బాయికాడ ముత్యాలు, ఆంజనేయులు, ఎం .యాదగిరి, మర్యాల ఆంజనేయులు, పోతరాజు సత్యం, మార్యాల ముత్యాలు, ఎల్లo, బాయికాడి వెంకటేష్, మర్యాల్ల రాజయ్య, కొట్టంల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.


0 Comments