Wanted Reporters

Wanted Reporters

ఆధ్యాత్మిక కార్యక్రమాలు..ఐక్యతకు దోహదపడతాయి

 ఆధ్యాత్మిక కార్యక్రమాలు..ఐక్యతకు దోహదపడతాయి


- క్రాంతి కాలనీ రోడ్డు నెంబర్ ఒకటిలో   ఘనంగా గణేష్ ఉత్సవాలు

- చిన్నారులతో నృత్యాలు, సాంస్కృతిక  కార్యక్రమాలు 

 - పాల్గొన్న డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లు జంగయ్య యాదవ్, చందర్ గౌడ్,నాయకులు  కిషోర్ గౌడ్, మల్కాజిగిరి అడిషనల్ డి సి పి ఎన్ వెంకట రమణ 




మేడిపల్లి / వాస్తవ తెలంగాణ మేడ్చల్ జిల్లా, మేడిపల్లి /సెప్టెంబర్  26 :

ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీవాసుల్లో ఐక్యతకు దోహదపడతాయని డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్ , కొత్త చందర్ గౌడ్ , మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మల్కాజిగిరి అడిషనల్ డి సి పి ఎన్ వెంకట రమణ  అన్నారు.  బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలోని క్రాంతి కాలనీ రోడ్డు నెంబర్ ఒకటి గణేష్ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపానికి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్ , కొత్త చందర్ గౌడ్  నాయకులు కొత్త కిషోర్ గౌడ్, మల్కాజిగిరి అడిషనల్ డి సి పి ఎన్ వెంకట రమణ లు  ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోల్డ్ రాజు మంజుల దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కమిటీ నిర్వాహకులు అతిధులను శాలువాతో సత్కరించారు.అనంతరం నరిగె రమేష్,  సహకారంతో పి ఆర్ డాన్స్ అకాడమీ చిన్నారులు వారి నృత్యాలతో క్రాంతి కాలనీ ప్రజలను అలరించారు. సంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన చిన్నారులకు అక్కడికి విచ్చేసిన అతిధులతో బహుమతులు ప్రదానం చేశారు. పి ఆర్ డాన్స్ అకాడమీ నిర్వాహకుడు రమేష్ మాట్లాడుతూ కాలనీ లో మాకు ఈ అవకాశమిచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతో మా పి ఆర్ డాన్స్ అకాడమీ మరింత ముందుకెల్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు బుల్లెట్ రమేష్, వి. లక్ష్మన్ నాయక్, అశోక్ రెడ్డి, యుగంధర్, ఈదుల రాజు గౌడ్,గోల్డ్ రాజు,శ్రీరామ్ నాయక్,శ్రీను నాయక్,రమణ రావు,వెంకట్ రెడ్డి,జానీ,కె.రాజి రెడ్డి, కాకినాడ రాజు, ఇప్పకాయల రాము,చంద్రా రెడ్డి లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code