రాజ్యాంగాన్ని మార్చే దమ్ము, ధైర్యం ఎవ్వరికి లేదు.
దళితహక్కుల సమితి సమావేశంలో సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 2 (వాస్తవ తెలంగాణ)....
మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్చాలి అన్న మాటలను ఉద్దేశించి నేడు దళిత హక్కుల పోరాట సమితి కుత్బుల్లాపూర్ నాయకుల సమావేశం నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యాతిథిగా సీపీఐ కార్యదర్శి పాల్గొని రాజ్యాంగాన్ని మార్చే దమ్ము ఎవ్వరికి లేదని అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ రాజ్యాంగం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే రాష్ట్రంలో ఉన్న బీసీ,ఎస్ సి,ఎస్ టి నాయకులు నేడు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని అలాంటి రాజ్యాంగం పైన వాక్యాలు చేసినందున బీసీ,ఎస్ సి,ఎస్ టి శాసనసభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ వాక్యాల వల్ల కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందని బీజేపీ ఆలోచనలను కేసీఆర్ పరోక్షంగా మద్దతు తెల్పుతూ అమలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇలాంటి ఆలోచనల్ని మార్చుకోకపోతే సీఎం కుర్చీ నుండి ప్రజలే మారుస్తారని హెచ్చరించారు. ఈ అంశం పైన అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా సంఘాలను, మేధావులను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు స్వామి,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు రాములు,మల్లేష్,సామెల్, శ్రీకాంత్, వాసుదేవ్,పవన్,రాజశేఖర్లు పాల్గొన్నారు.
0 Comments