రాధిక నగర్ కాలనీలో ఘనంగా గణేష్నవరాత్రి ఉత్సవాలు....
*- పాల్గొన్న చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త లక్ష్మి రవి గౌడ్,
మేడ్చల్ జిల్లా,(వాస్తవతెలంగాణ మేడిపల్లి/సెప్టెంబర్ 26)
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ చెంగిచర్ల రాధిక నగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి 9వ రోజు గణపతికి ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం రాధిక నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవిగౌడ్, కో-ఆఫక్షన్ సభ్యులు రంగ బ్రాహ్మణ్ గౌడ్, 1వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బింగి యోగి యాదవ్ పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా రాధిక నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కులాలు, మతాలకు అతీతంగా నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తు డివిజన్ ప్రజలు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో ఉండేటట్టు వినాయకుడిని దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాధిక నగర్ కాలనీ కమిటీ సభ్యులు సైదులు, హరి, కృష్ణ, మల్లేష్, రాజు, ప్రేమ్ కుమార్, రమేష్,పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments