బైక్ ర్యాలీని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ మంజుశ్రీ &ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ఆందోల్,వాస్తవ తెలంగాణ న్యూస్:-
ఆందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో హోప్ న్యూరో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు బైక్ నడిపే వ్యక్తులకు ఆందోల్ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి ఇందులో పాల్గొని హెల్మెట్లు అందజేసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులు ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. ఇందులో హోప్ హాస్పటల్ డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


0 Comments