Wanted Reporters

Wanted Reporters

జాతీయ సమైక్యత స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నాం

 జాతీయ సమైక్యత స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నాం


భరత్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు



వాస్తవ తెలంగాణ/రామగుండం ప్రతినిధి 



తెలంగాణ జాతీయ సమైక్యతను పురస్కరించుకొని గోదావరిఖని హనుమాన్ నగర్ లోని 41వ డివిజన్ భారత్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగుర వేశారు.తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు బాద్యులు మాట్లాడుతూ... తెలంగాణ పోరాట వీరులను, జాతి నిర్మాతలను నిత్యం స్మరించుకోవాలని  పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరు నిర్వహించాలని పిలుపునిచ్చారు.భావితరాలకుసెప్టెంబర్-17 విశిష్టతను తెలియజేయాలన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి నేటికి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ 41వ డివిజన్ కాలనీ వాసులు మారుపాక శ్యామ్, అయోధ్య రవి, కొట్టే మధునయ్య, గుండారపు రవి కోలేటి సతీష్, కనవేణి ఆనంద్, యశ్వంత్, నునేటి దేవేందర్, దుర్గం గోపి, మిట్టపల్లి వెంకటేష్, పెనుగొండ సతీష్, మారుపాక శ్రావణ్ కుమార్, దుప్పటి శ్రీకాంత్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code