గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని శ్రీకర ఆర్గానిక్స్ పరిశ్రమలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు కార్మి కులను ఎస్ఎన్జీ దవాఖాన నుంచి మెరుగైన వైద్యం కోసం శుక్రవారం నగరం లోని డీఆర్డీఏ అపోలో దవాఖానకు తలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు బొల్లారం సీఐ సురేందర్రెడ్డి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ అనూప్, శ్రీక మల్ అనే ఇద్దరు కార్మికులు వైద్య చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తు తం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు.

0 Comments