దూలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్
![]() |
వాస్తవ తెలంగాణ న్యూస్:-మేడ్చల్ జిల్లా నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. మల్లికార్జున స్వామి వారి జాతర సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments