గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలన మన ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ తెలిపారు.
(రామగుండం వాస్తవ తెలంగాణ ప్రతినిది )
బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్స్ , ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర ప్రజా ప్రతినిధులతో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీఐ సంజీవ్ గారు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు. పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ల వ్యాప్తంగా నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలన గురించి అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నిషేధిత మత్తు పదార్థాల వ్యాపారం చేసినచో చట్టపరమైన చర్యలు తప్పవని, ఇటువంటి వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసుకు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
👉డ్రగ్స్ గంజాయి ను సమూలంగా అరికట్టడం లో ప్రజా ప్రతినిధుల తో పాటు ప్రజల పై కూడా బాధ్యత ఉందని, ఎక్కడైనా వాటి సరఫరా, ఉత్పత్తులు జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
👉తల్లితండ్రులు తమ పిల్లలు డ్రగ్స్, గంజాయి కు ఎడిక్ట్ అయినట్లు గుర్తించిన సీక్రెట్ గా పోలీస్ వారికి సమాచారం అందిస్తే వారిని కౌన్సిలింగ్ కు పంపడం జరుగుతుందని అన్నారు.
👉 ఆ గ్రామనికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ రద్దుకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని ఈ విషయాన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజలు ఎవరు కూడా ఆశకు పోయి ఇబ్బందులు పడవద్దు అని సీఐ గారు విజ్ఞప్తి చేశారు.
అనంతరం
ప్ర తి జ్ఞ
మాయొక్క వీధిలో గాని, గ్రామములో గాని ఎవరైనా వ్యక్తులు అట్టి నిషేదిత మత్తు పదార్థాలు సేవించినా, అమ్మినా, కొన్నా, రవాణా చేసినా లేదా గంజాయి మొక్కలు ఎవరయినా సాగు చేసినా వెంటనే నేను అట్టి సమాచారంను సంబందిత పోలీస్ అధికారులకి సమాచారం అధిస్తాం అని మాయొక్క గ్రామమును పూర్తిగా గంజాయి/డ్రగ్స్ రహిత గ్రామముగా తీర్చిదిద్దుతాము ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇ. ప్రభాకర్ , ఎస్ఐ శ్రీనివాస్,పోలీస్ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
0 Comments