రోడ్డు ప్రమాదం లో మరణించిన లావణ్య కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన ఎర్ర యాకన్న..
కుత్బుల్లాపూర్ (వాస్తవ తెలంగాణ)....
జగద్గిరిగుట్ట:- రోడ్డు ప్రమాదంలో మరణించిన కుంచం లావణ్య(26) కుటుంబానికి ఆర్ధిక సహాయం ఇప్పించిన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు ఎర్ర యాకన్న... వివరాల్లోకి వెళితే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ ప్రాంతంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో కుంచం రాజు భార్య లావణ్య (26) ను టిప్పర్ డీ కొట్టడం తో లావణ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బుధవారం టిప్పర్ యాజమాన్యం తో మాట్లాడి లావణ్య కుటుంబానికి మానవతా దృక్పథంతో 8 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెరాస నాయకులు ఎత్తరి మారయ్య, గుంజా మహంకాళి, వెంకటేష్, రాజా రెడ్డి, విత్తల్ ముదిరాజ్, నాగరాజు, వెంకటేష్, పర్వతాలు, ముస్తఫా, రాము, వెంకటయ్య, నర్సింలు, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
0 Comments