Wanted Reporters

Wanted Reporters

భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి... బీఎస్పీ పార్టీ నాయకులు నిరసన

 భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి... బీఎస్పీ పార్టీ నాయకులు నిరసన 




ఖమ్మం నగరంలో బుధవారం అంబేడ్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేందర్ సాహో ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిందని , ఆయన అనుభవించే పదవులన్నీ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు .  భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని అనుకోవడం అవివేకమని , మూర్ఖత్వమని , భారత ప్రజానీకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు . జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ కు వినతిపత్రం సమర్పించారు .ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి పీసీ వీరస్వామి , జిల్లా కార్యదర్శులు బి ఉపేందర్ , కె.కృష్ణ , ఉదయ్ , మిర్యాల నాగరాజు , జిల్లా నాయకులు అన్నెపోగు ఉపేందర్ , మట్టే నాగేశ్వరరావు , డాక్టర్ కెవి కృష్ణారావు , డాక్టర్ శ్రీనివాస్ , విజయ్ , బాలరాజు , రాజశేఖర్ , మహిళా కన్వీనర్లు విజయ , మంజుల , మాధవి తదితరులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments

Ad Code