Wanted Reporters

Wanted Reporters

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వార్డు సభ్యులు

 


*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వార్డు సభ్యులు
*

జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్ :-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మహేష్ యాదవ్ పరిశీలించారు.  నిన్న కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని నాయకులు పరిశీలించారు. ఇప్పటివరకు  4,500 క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్ కు తరలించినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని స్థానిక నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ అధికారి మనోజ, శ్రీనివాస్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code