గణపురం గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ తీర్మానం చేసిన పాలకవర్గ సభ్యులు
తూప్రాన్ తెలంగాణ సాక్షి న్యూస్ :-
మెదక్ జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో సర్పంచ్ పుష్ప, ఉప సర్పంచ్ ఆకుల రవి అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు.అనంతరం సర్పంచ్ పుష్ప నవీన్,ఉప సర్పంచ్ ఆకుల రవి మాట్లాడుతూ ఘణపురం గ్రామంలో పాలకవర్గ సమావేశం నిర్వహించి కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచి మిగతా సమయంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించాల్సినదిగా పాలక వర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది అని తెలిపారు గ్రామ ప్రజలందరూ సహకరించాలన్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒకవేళ వచ్చినా మాస్కు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరొనా నియంత్రణకు పాటుపడాలని పేర్కొన్నారు ఈ పాలక వర్గ సమావేశంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, వార్డు సభ్యులు దొడ్ల గణేష్, పసుల రవీందర్, సయ్యద్ అన్వర్, పేదోల్ల స్వామి, గడ్డి జ్యోతి, నర్సాపురం సరూప, టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments