నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్*
తెలంగాణ సాక్షి న్యూస్కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ వైద్యులు, పోలీసులు పారా మెడికల్ సిబ్బంది ముందుండి ప్రజలను కాపాడుతున్నారు.
అంత కష్టపడుతున్న నర్సుపై ఆస్పత్రి డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కోరుట్లలోని శ్రీలక్ష్మి ఆస్పత్రిలో రాజేష్ అనే వైద్యుడు పని చేస్తున్నాడు.
రాజేష్ అదే ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై లైంగిక వేధింపులలకు పాల్పడ్డాడు.
అతని వేధింపులు భరించలేని నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ పై లైంగిక వేధింపులు చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0 Comments