మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
గుమ్మడిదల లో రంజాన్ కానుకలు పంపిణీ
బొంతపల్లి లో గొర్రెలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
మైనారిటీల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన గుమ్మడిదల లో బుధవారం నిరుపేద ముస్లిం కుటుంబాల కు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి సారిగా షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మతాలవారు తమ పండుగలను సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గడం లేదన్నారు. అనంతరం బొంతపల్లి లో 30 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.


0 Comments