సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మూడు రౌండ్లలోనూ దూసుకుపోతున్నారు.
తెలంగాణ సాక్షి న్యూస్:-
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ దూసుకుపోతున్నారు. వరుసగా తొలి మూడు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి

0 Comments