ఈటెల రాజేందర్ అభిమాని ఆత్మహత్య యత్నం
తెలంగాణ సాక్షి న్యూస్:-
మంచిర్యాల జిల్లా:* మందమరి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ఈటల రాజేందర్ని ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గా తొలగించారని మనస్తాపం చెందిన బండి వెంకటేష్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఎంతోమంది పేద వారికి అండగా ఉంటూ పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఈటెల రాజేందర్ గారికి టిఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానానికి మనస్తాపం చెందిన బండి వెంకటేష్ అక్కడే ఉన్న వ్యాన్ క్రింద పడి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వెంకటేష్ ని అక్కడి నుండి తరలించారు. *వెంకటేష్ గత ఐదు సంవత్సరాలుగా ఈటల యువసేన పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు

0 Comments