Wanted Reporters

Wanted Reporters

రాహుల్ గాంధీ సభ ను సంగారెడ్డిలో ప్రత్యక్ష ప్రసారం

 

 రాహుల్ గాంధీ సభను సంగారెడ్డిలో ప్రజలతో కలిసి వీక్షించిన జగ్గారెడ్డి


ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం


ఢిల్లీ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు


సంగారెడ్డి, వాస్తవ తెలంగాణ న్యూస్:


ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న సభను సంగారెడ్డిలోనూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాట్లు చేయించారు.

ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ఢిల్లీలో జరుగుతున్న సభను వీక్షించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు.

మరోవైపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సభకు నిర్మలా జగ్గారెడ్డితో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Post a Comment

0 Comments

Ad Code