Wanted Reporters

Wanted Reporters

దీపావళి వేళ మున్సిపల్ కార్మికులకు కానుక

 


దీపావళి వేళ మున్సిపల్ కార్మికులకు కానుక

- సొంత నిధులతో కార్మికులకు నూతన దుస్తుల పంపిణీ
- చైర్మన్ కుమార్ గౌడ్ దంపతుల చేతుల మీదుగా అందజేత
- మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

గుమ్మడిదల,వాస్తవ తెలంగాణ న్యూస్:

దీపావళి పండుగను పురస్కరించుకొని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ తన సొంత నిధులతో మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. తన సతీమణి స్వాతితో కలిసి కార్మికులకు దుస్తులను అందజేశారు. పండుగ వేళ కార్మికులతో సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యం పారిశుద్ధ్య నిర్వహణతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు వివిధ సేవలందిస్తున్న కార్మికుల సేవలను గుర్తిస్తూ దీపావళి కానుకగా నూతన దుస్తులను అందించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ దంపతులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. కార్మికులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ దశరథ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య, వార్డు కౌన్సిలర్లు పద్మ, రాజశేఖర్, మురళి, నిర్మల, రాధిక, కిషన్, సంజీవరెడ్డి, సోనీ, గౌసియా, మాధవి, రమేష్, ప్రమీల, జైపాల్ రెడ్డి, రాజిరెడ్డి, వరలక్ష్మి, విజయలక్ష్మి, చక్రపాణి, పద్మ, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code