Wanted Reporters

Wanted Reporters

పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్న బిఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి

 


పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్న ఆదర్శ్ రెడ్డి

పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్న ఆదర్శ్ రెడ్డి

45 రోజుల గడువు ఇవ్వాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి.. హామీతో ఊపిరి పీల్చుకున్న బాధిత కుటుంబాలు

బాధితులకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించాలి.. రైల్వే అధికారులను కోరిన బీఆర్ఎస్ నేత

శేరిలింగంపల్లి,వాస్తవ తెలంగాణ న్యూస్:

ఓల్డ్ ఎం.ఐ.జి శేరిలింగంపల్లి పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి. ప్రాంతంలో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల ఇళ్ల తొలగింపు చర్యలను పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి అడ్డుకున్నారు. రైల్వే పోలీసులు, అధికారులు ఇళ్ల తొలగింపునకు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.
దశాబ్దాలుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించకుండా ఇళ్లను తొలగించడం సరికాదని అధికారులకు వివరించారు. ఒక్కసారిగా ఇళ్లను తొలగిస్తే అనేక కుటుంబాలు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైల్వే అధికారుల సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు కల్పించేలా చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆదర్శ్ రెడ్డి తెలిపారు. మానవతా దృక్పథంతో బాధితులకు కనీసం 45 రోజుల గడువు ఇవ్వాలని రైల్వే అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రైల్వే సిబ్బంది 45 రోజుల వరకు వేచి ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పరిణామంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, గిరి, నర్సింహ, సంపత్ గౌడ్, చిన్న, తిలావత్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code