పదో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ పర్యటన.
తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ఆరా.
అసంపూర్తి బస్తీ దవాఖాన పనుల పరిశీలన.
వాస్తవ తెలంగాణ న్యూస్,మెదక్ టౌన్ :-
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి. రోహిత్ రావు సూచనల మేరకు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ 10 వార్డులో బుధవారం పర్యటించారు. వార్డులో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బుడగ జంగాల కాలనీలో తాగునీటి ఇబ్బందులపై ఆరా తీశారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న బస్తీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించి వాటి పురోగతిని తెలుసుకున్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చింతల.లక్ష్మీ దిలీప్‌కుమార్, కౌన్సిలర్లు నస్రిన్ బేగం,చేదల సంధ్య, పల్లె రాణి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


0 Comments