ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో 12 కోట్ల రూపాయలతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లు..
తోషిబా సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు..
ప్రతి వార్డు పరిశుభ్రతకు చిరునామాగా నిలవాలి..
ప్రతి డివిజన్ కి స్వీపింగ్ మిషన్, టిప్పర్, జెసిబి..
ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు మైత్రి మైదానం వేదికగా వాహనాల ప్రారంభం..
పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుద్ధ సిబ్బందిని పెంచాలి..
ప్రభుత్వానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సూచన..
పటాన్చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
అనునిత్యం. అనుక్షణం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయడంలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సైబరాబాద్ మున్సిపల్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు, కాలనీలకు అనుగుణంగా పారిశుధ్య అవసరాల కోసం తోషిబా పరిశ్రమ సహకారంతో 12 కోట్ల రూపాయలతో పారిశుద్ధ్య వాహనాలు కొనుగోలు చేసి అందించారు.
సోమవారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్, తోషిబా పరిశ్రమ హెచ్ఆర్ డైరెక్టర్ మారు మోటో చేతుల మీదుగా తొలి విడతలో కొనుగోలు చేసిన 5 టిప్పర్లు, 5 స్వీపింగ్ మెషిన్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2014 నుండి 2023 వరకు పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మూలంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడంతో పాటు వందల సంఖ్యలో నూతన కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు.
ఇందుకు అనుగుణంగా సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిల్స్ పరిధిలోగల తొమ్మిది డివిజన్లలో గల ప్రజలకు పారిశుద్ధ్య అంశంలో మెరుగైన సేవలు అందించడంలో భాగంగా నూతన వాహనాల కొనుగోలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు పరిధిలోని తోషిబా పరిశ్రమ అందించిన 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో 10 స్వీపింగ్ మెషీన్లు, పది టిప్పర్లు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వీటిలో పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు.
మొదటి విడతలో కొనుగోలు చేసిన వాటిలో అమీన్పూర్ సర్కిల్ కు 3 స్వీపింగ్ మిషన్లు, మూడు టిప్పర్లు, పటాన్చెరు సర్కిల్ కు 2 స్వీపింగ్ మిషన్లు, 2 టిప్పర్లు అందించడం జరిగిందని తెలిపారు.
బిహెచ్ఎల్ చౌరస్తా నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు గల జాతీయ రహదారి పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా మరో స్లీపింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రతి కాలనీ పారిశుద్ధ అంశంలో ప్రగతి సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వెయ్యకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త వాహనాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పారిశుధ్య వాహనాలు కొనుగోలు కోసం 12 కోట్ల రూపాయలు అందించిన తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని నియమించండి..
9 డివిజన్ల పరిధిలో పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో నూతన సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రతిరోజు చెట్ల సేకరించకపోవడం మూలంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్ పరిధిలో నూతన పారిశుద్ధ సిబ్బందిని తక్షణమే నియమించాలని కోరారు.
పారిశుద్ధ్య వాహనాలతో పాటు జెసిబిలు సైతం అందిస్తున్నామని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో తమను భాగస్వాములను చేసినందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తోషిబా పరిశ్రమ ఎండి మారు మోటో తెలిపారు. అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ ప్రశంసనీయం..
సీఎంసీ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ కోసం సి ఎస్ ఆర్ నిధులతో వాహనాలు కొనుగోలు చేసి అందించడంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ ప్రశంసనీయమని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కావ్య, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి, తోషిబా పరిశ్రమ జనరల్ మేనేజర్ రామకృష్ణ, సీనియర్ మేనేజర్ రాజా, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, కుమార్ యాదవ్, సింధు రెడ్డి, అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మాజీ డిసి ప్రదీప్ కుమార్, బల్దియా అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


0 Comments