ప్రణాళిక ప్రకారమే తనపై దాడి..ఈటల
తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: మెరుగైన సేవలందించే వైద్య ఆరోగ్యశాఖను తన నుంచి తప్పించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం, ఏ మంత్రినైనా తొలగించే అధికారం సీఎంకు ఉందని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా ప్రజలకు తోడుంటానని చెప్పారు. ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతోందని, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను ప్రజలే అసహ్యించుకుంటున్నారని తెలిపారు. తనపై నిందలు మోపిన వారు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈటల అన్నారు. సీఎంతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించలేదని, ఆప్రయత్నం కూడా చేయబోనని ఈటల స్పష్టం చేశారు.

0 Comments