పేద పెళ్లికి సహాయం అందించిన ఎంపిపి రవీందర్ గౌడ్
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
జిన్నారం గ్రామంలో ఎర్రవల్లి బాలయ్య కుమారుడు కళాకారుడు ఎర్రవల్లి రవి (డోలక్ రవి) వివాహానికి మనసున్న మహారాజు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేద ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అన్ని వేళల సహాయం చేస్తానని ఎంపిపి రవీందర్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సొలక్ పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, అండూర్ సత్యనారాయణ, కంది ఎల్లయ్య, యనగండ్ల నరేందర్ ,శకరయ్య ,అశోక్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments