Wanted Reporters

Wanted Reporters

కొత్తపల్లి గ్రామంలో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 కొత్తపల్లి గ్రామంలో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ 

గుమ్మడిదల, తెలంగాణ సాక్షి  న్యూస్ ఏప్రిల్28:-


కరోన మహమ్మారి బారిన పడకుండా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు చొరవ తీసుకుంటున్నారు.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి  హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీచేయిస్తున్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ బానోత్ ఆంజనేయులు నాయక్ మరియు ఉప సర్పంచ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని అన్ని వీధుల గుండా, ఇంటిలో, ఇంటి ఆవరణంలో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ  స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ కరోనా తోపాటు మలేరియా, డెంగ్యూ లాంటి వైరసుల బారిన పడకుండా  హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ ఎంతో ఉపయోగపడుతుందని, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదని వారు  సూచించారు. హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసిన గ్రామాల్లో కరోన ఉధృతి లేదని ఆయా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ కుమార్, పంచాయతి కార్యదర్శి, వార్డు మెంబర్లు గ్రామస్థులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code