Wanted Reporters

Wanted Reporters

భక్తిశ్రద్ధలతో బొంతపల్లి దుర్గమ్మ తల్లి బోనాల జాతర

 

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి


 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో నిర్వహించిన దుర్గమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్‌తో కలిసి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.


అనంతరం చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని దుర్గమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చక్రపాణి, కుమార్ గౌడ్, విజయలక్ష్మి,రాజశేఖర్, మురళి, పద్మ, జయపాల్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి,నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, వెంకట్ రామ్ రెడ్డి, హుస్సేన్, తుపాకుల రాజు, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, సంజీవరెడ్డి, మహేష్, రమేష్,వినోద్ గౌడ్, శంకర్, నాగేష్ గౌడ్, చందు,కౌశిక్ గౌడ్, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code