లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో 50వ డివిజన్లో కుంకుమ పూజ, అన్నదానం
వాస్తవ తెలంగాణ, సెప్టెంబర్ 24/ రామగుండం ప్రతినిధి: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని, 50వ డివిజన్ లో లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం జరిగింది. గోదావరిఖని లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ, 108 రకాల నైవేద్యాలతో పాటు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి మిత్రమండలి సభ్యులు, మహిళా మణులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మహిళలే భోజన సదుపాయాలు కల్పించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో లతా, వనజ, స్రవంతి, జానకి, విజయ, లక్ష్మి, జ్యోతి, మంజుల, అనురాధ, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


0 Comments