Wanted Reporters

Wanted Reporters

పేదొడికి ఆక్సిజన్ సిలిండర్ లను ఉచితంగా అందిస్తా - నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి

 పేదొడికి ఆక్సిజన్ సిలిండర్ లను ఉచితంగా అందిస్తా - నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి

బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-

కరోనా విజృంభిస్తుండడంతో పేద వారికి ఎంతో కొంత సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు ఓ నాయకుడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ కి చెందిన బిజెపి నాయకులు కె జే ఆర్ ట్రస్ట్ ఫౌండర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆపత్కాలంలోఆక్సిజన్ సిలిండర్ లను అందించాలని సంకల్పంతో ముందుకు వచ్చి పేదవారికి ఆదుకున్నాడు. తన ట్రస్టు ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్ లను స్పందిస్తూ సేవా తత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని పేదవారికి తాను ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తానని ఆయన పేర్కొన్నాడు. కరోనా కట్టడి లో ప్రభుత్వం విఫలమైందని, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తాను ట్రస్ట్ ద్వారా ప్రతి పేదవాడికిఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదవారికి సహాయం అందించడమే తన కర్తవ్యమని ఆనంద్ కృష్ణారెడ్డి ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైతే తనను సంప్రదించండని



తెలిపారు....

Post a Comment

0 Comments

Ad Code