అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.
తెలంగాణ సాక్షి న్యూస్:-
మెదక్: మాసాయిపేట మండలం అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రైతుల ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఆరోపణలపై దర్యాప్తు జరపాలని విజిలిన్స్ డీజీ పూర్ణచంద్రరావుకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కాసేపట్లో మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. భూ కబ్జా ఆరోపణలపై స్పందించనున్నారు.

0 Comments